AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య జల..

AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..
Jagadish Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2021 | 8:26 PM

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య జల వివాదంపై మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఈ వివాదంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిని తూర్పారబట్టారు. గురువారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నీటి పంచాయతీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారమే కారణం అని ఆరోపించారు. అన్నీ చేసి ఇప్పుడేం ఎరుగనట్లు నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. అలాగే.. జల వివాదం నేపథ్యంలో ప్రాజెక్టుల వద్దకు ఏపీ సర్కార్ కేంద్ర బలగాలను కోరడంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి.. కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనానికి నిదర్శనం అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 34 జీవోకు అభ్యంతరం చెప్పే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముందుగా ఆ రాష్ట్రం విడుదల చేసిన 203 జీవోను ఉపసంహరించుకోవాలని హితవుచెప్పారు. పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోలేని ఆంధ్రా సర్కార్.. అటు కేంద్రానికి, ఇటు సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘తెలంగాణ ఎప్పుడూ సక్రమమే.. అక్రమం మా రక్తం లోనే లేదు’ అని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు ఏమీ ఇబ్బంది లేదన్నారు. నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రా ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సర్కార్‌పై ఫిర్యాదు.. ఇదిలాఉంటే.. హైదరాబాద్‌లోని జలసౌధలో ఎంపీ సింగ్‌ను కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు నీటి సంఘాల ప్రతినిధులు కలిశారు. తెలంగాణతో జలవివాదంతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. ఎంపీ సింగ్‌ను కలిసిన వారిలో ఏపీ సాగునీటి సంఘాల అధ్యక్షుడు ఆళ్ళ గోపాలకృష్ణ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై 255 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులు చేట్టిందన్నారు. పాలమూరు – రంగారెడ్డి సహా తెలంగాణ ప్రాజెక్టులు కొత్తవే అని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని గోపాలకృష్ణ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరుతో ఏపీ ప్రజలు నష్టపోతారని అన్నారు. కృష్ణా డెల్టా సహా ఏపీ భూములు బీళ్లు కావాలా..? అని గోపాలకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు.

Also read:

Telangana Corona Updates: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..

Viral Photos: బెడ్ కింద పాముల కుప్ప.. తాడు ముక్కలనుకుని కదిలించిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Covid-19 Kit: ఐఐటీ హైదరాబాద్ ప్రోఫెసర్ల అద్భుత ఆవిష్కరణ.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్‌..