పల్లె నిద్ర చేసిన తండాలో మొక్కలు నాటిన మంత్రి.. ఆ విషయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్న ఎర్రబెల్లి
సీఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు..
సీఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తాను పల్లె నిద్ర చేసిన హనుమాన్ తండాలో ప్రజలందరి తో కలిసి వందలాది మొక్కలు నాటారు. అలాగే వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి లో ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం మామునూర్ నాలుగవ బెటాలియన్ లో మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఅర్ బర్త్ డేకి బహుమతిగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని అన్నారు. మొక్కలు నాటడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని చెప్పారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా, పేదలకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్, కేసీఅర్ కిట్ లు , మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టామన్నారు. తండాలలో కూడా తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఎం కేసీఅర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, కార్పొరేటర్ చింతల యాదగిరి, లలిత యాదవ్, పోలీస్ బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వేల మొక్కలను శిక్షణలో ఉన్న పోలీస్ లు నాటారు.
Read more: