AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో విజయవంతమైన ‘కోటి వృక్షార్చన’.. ఇంతకీ సీఎం కేసీఆర్ ఏ మొక్క నాటారో తెలుసా..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం..

తెలంగాణలో విజయవంతమైన 'కోటి వృక్షార్చన'.. ఇంతకీ సీఎం కేసీఆర్ ఏ మొక్క నాటారో తెలుసా..?
K Sammaiah
|

Updated on: Feb 17, 2021 | 2:49 PM

Share

తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.

ఇటు తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఒక్క గంటలోనే కోటి మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొన్నారు. తన స్వహస్తాలతో రుద్రక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రోగ్రాం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

Read more:

ఆంధ్రప్రదేశ్‌లో వెలసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీలు.. అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన ఏపీ ప్రజలు

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..