ఆంధ్రప్రదేశ్‌లో వెలసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీలు.. అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన ఏపీ ప్రజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లో వెలసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ భారీ ఫ్లెక్సీలు.. అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన ఏపీ ప్రజలు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 17, 2021 | 1:49 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న కేసీఆర్‌ అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ కేసీఆర్‌కు అభిమానులున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది.

కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. విశాఖపట్నం అచ్యుతాపురంలో కేసీఆర్‌ అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలపై కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

తెలంగాణ వాసులే కాకుండా తెలంగాణేతర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది. రాష్ట్రం విడిపోయినా కూడా ఏపీ ప్రజలు కేసీఆర్ పై అభిమానం కురిపిస్తూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అభిమానానికి హద్దులు లేవని ఏపీ ప్రజలు మరోసారి నిరూపించారు.

Read more:

బల్కంపేట అమ్మవారికి బంగారు చీర.. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని కానుక

చింతూరు పంచాయతీ ఎన్నికల్లో విషాదం.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఏపీవో హఠాత్తుగా మృతి