AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఒక్క ఓటర్ కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భయంతో పరుగులు తీసిన పోలింగ్ సిబ్బంది, ఓటర్లు..!

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలం చౌడవాడలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది.

AP Local Body Elections: ఒక్క ఓటర్ కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భయంతో పరుగులు తీసిన పోలింగ్ సిబ్బంది, ఓటర్లు..!
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2021 | 3:32 PM

Share

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలం చౌడవాడలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఒక్క ఓటరు కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటరు తమ వాడంటే తమ వాడంటూ ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు గోడవకు దిగారు. పోలింగ్ సెంటర్‌లోనే కుర్చీలతో కొట్టుకున్నారు. దాంతో అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన పోలింగ్ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఓటర్లు సైతం అక్కడి నుంచి పారిపోయారు. ఈ వివాదం నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు చోట్ల కీలక పార్టీలకు చెందిన వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

Clashes Video:

Also read:

AP Panchayat Elections Polling: బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కనిపించడం లేదంటూ పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఆందోళన

ఛాలెంజింగ్‌గా పోలింగ్, మూడంచెల భద్రతా వ్యవస్థ, 20 కి.మీ పైన ప్రయాణించి కేంద్రాలకు తరలివచ్చిన గిరిజన బాలింతలు