AP Panchayat Elections Polling: బ్యాలెట్ పత్రంలో గుర్తు కనిపించడం లేదంటూ పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఆందోళన
AP Panchayat Elections Polling: ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా కొనసాగుతోంది...
AP Panchayat Elections Polling: ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రంపై ఒకే గుర్తులు ఉండటం, బ్యాలెట్ పత్రంలో గుర్తులు సరిగ్గా కనిపించకపోవడం సదరు అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నాయి.
విశాఖలో సర్పంచ్ అభ్యర్థి, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరులో సర్పంచ్ అభ్యర్థి రాజులమ్మకు ఇస్త్రీ పెట్టె గుర్తును కేటాయించారు ఎన్నికల అధికారులు. అయితే బ్యాలెట్ పత్రంలో తనకు కేటాయించిన గుర్తు కనిపించడం లేదని ఆమె పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.