ట్రంప్ ‘అబ్రహం’ ఉచ్చులో పాకిస్తాన్.. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే ఖతం చేస్తామన్న లష్కర్!
ఇరాన్ - అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్‌కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న అమెరికా డిమాండ్‌తో పాక్ ప్రభుత్వం ప్రస్తుతం 'ముందు గొయ్యి.. వెనుక నుయ్యి' అన్న చందంగా తయారైంది.

ఇరాన్ – అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్‌కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అబ్రహం ఒప్పందాల్లో’ చేరాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న అమెరికా డిమాండ్‌తో పాక్ ప్రభుత్వం ప్రస్తుతం ‘ముందు గొయ్యి.. వెనుక నుయ్యి’ అన్న చందంగా తయారైంది.
మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన పేరుతో ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరుచుకునేలా అమెరికా ‘అబ్రహం ఒప్పందాలను’ ముందుకు తెచ్చింది. ఇప్పటికే కొన్ని అరబ్ దేశాలు దీనికి అంగీకరించగా, ఇప్పుడు పాకిస్థాన్‌పై కూడా అమెరికా కన్నేసింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా సాయం కావాలి, మరోవైపు ఇజ్రాయెల్‌ను గుర్తిస్తే దేశీయంగా తలెత్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఉగ్రవాద సంస్థల నుంచి బహిరంగ హెచ్చరికలు రావడం సంచలనంగా మారింది. లష్కర్-ఎ-తైబా డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి నేరుగా వార్నింగ్ ఇచ్చేశాడు. “పాకిస్థాన్‌లో ఏ నాయకుడైనా, ఆర్మీ అధికారి అయినా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడానికి లేదా దౌత్య సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తే వారిని వదిలిపెట్టం.. వారిని చంపేస్తాం.” అంటూ సైఫుల్లా కసూరి హెచ్చరించారు.
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత సంక్లిష్టమైన స్థితిలో ఉంది. అమెరికాతో సంబంధాలు తెంచుకోలేరు, అలాగని ఇజ్రాయెల్‌ను ఆమోదించలేక అంతర్జాతీయ ఒత్తిడిలో చిక్కుంది. మరోవైపు, స్వయంగా పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే ఇప్పుడు ప్రభుత్వంపై తిరగబడుతున్నాయి. దేశాన్నే శాసించే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులోకి వెళ్లడం ఆ దేశ అస్థిరతను సూచిస్తోంది. చివరకు, ఇరాన్-అమెరికా మధ్య రాయబారం నడపాలని ఆశించిన పాకిస్థాన్, సొంత దేశంలోని తీవ్రవాద శక్తుల భయంతో ఏ నిర్ణయం తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
