AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాము కాటేసినా నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక్!

పామును చేతులతో పట్టుకోవడానికి అత్యుత్సాహం చూపిన అమెరికా మంత్రిని ఓ పాము కాటేసింది. అయితే పాము కరిచినా ఆయన నవ్వుతూ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైల్డ్ పాములను ఇలా చేతులతో పట్టుకోవడం ప్రమాదకరమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Viral Video: పాము కాటేసినా నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక్!
Robert F Kennedy Jr Snake Bite Controversy
Srilakshmi C
|

Updated on: May 27, 2026 | 1:42 PM

Share

అమెరికా మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ మరోసారి తన విచిత్రమైన చర్యలతో వార్తల్లో నిలిచారు. పామును పట్టుకోవడానికి అత్యుత్సాహం చూపడంతో అది కాటేసింది. అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్‌ ఓజ్‌ ఇంటిపై రెండు బ్లాక్‌ రేసర్‌ జాతి పాములు కనిపించాయి. వెంటనే కెన్నెడీ వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఓ పాము ఆయన చేతిపై కాటు వేసింది. అది విషపూరితమైన పాము కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఫ్లోరిడాకు చెందిన ఈ వీడియోలో ఆర్‌ఎఫ్‌కే జూనియర్ రెండు పెద్ద పాములను చేతులతో పట్టుకుని కనిపించారు. ఈ సమయంలో ఆయన భార్య Cheryl Hines జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం వీడియోలో వినిపించింది. అయితే ఒక్కసారిగా పాముల్లో ఒకటి ఆయన చేతిపై కాటు వేసింది. అయినప్పటికీ ఆయన నవ్వుతూనే ఉండటం వీడియోలో చూడొచ్చు. డాక్టర్ ఓజ్‌ పామ్ బీచ్ నివాసంలోని పేటియో ప్రాంతంలో ఉన్న పాములను ఆయన బయటకు తీస్తున్న క్రమంలో పాము ఆయన చేతిపై కాటు వేసింది.

అవి ప్రమాదకరమైన పాములా?

విదేశీ మీడియా కథనాల ప్రకారం అవి “సదర్న్ బ్లాక్ రేసర్” అనే జాతికి చెందిన పాములు. ఇవి ఫ్లోరిడాలో సాధారణంగా కనిపిస్తాయి. వేగంగా కదిలే ఈ పాములు మనుషులకు పెద్దగా హానికరం కావు. అయినప్పటికీ ఈ పాములను చేతులతో పట్టుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను “ఫ్లోరిడా ఫైనల్ బాస్” అంటూ కామెంట్ చేశారు. మరికొందరు “ఆర్‌ఎఫ్‌కే జూనియర్ పాములను పట్టుకోవడం చూస్తే మొబైల్ చార్జింగ్ వైర్లు పట్టుకున్నట్టుంది” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇంకొందరు అమెరికా రాజకీయాలు మాత్రమే ఇప్పటి వరకు వింతగా ఉన్నాయి, ఇప్పుడు పాములతో ఆడుకోవడం కొత్త లెవెల్ అంటూ పోస్టులు పెట్టారు.

కాగా ఫ్లోరిడాలో 40కి పైగా పాముల జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి కూడా. పాములను పట్టుకోవడానికి శిక్షణ పొందిన నిపుణులు ప్రత్యేక గ్లోవ్స్, హుక్స్, రక్షణ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి పాములను తాకకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం చాలామంది ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా పాములు వంటి విషసర్పాల విషయంలో సరైన అవగాహన లేకుండా దగ్గరికి వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుంది.

Follow Us
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్
జియో నుంచి సరికొత్త ఓటీటీ పాస్
జియో నుంచి సరికొత్త ఓటీటీ పాస్
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఏ రాశి వారికి ఇది శుభప్రదం..
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఏ రాశి వారికి ఇది శుభప్రదం..
ఆ జట్టు ఫైనల్‌కు వస్తే మేం బ్యాగ్‌లు సర్దేసుకోవడమే..!
ఆ జట్టు ఫైనల్‌కు వస్తే మేం బ్యాగ్‌లు సర్దేసుకోవడమే..!