చాణక్య నీతి : కొంత మంది పదే పదే అవమానాలు ఎందుకు ఎదుర్కొంటారో తెలుసా?

samatha

27 may 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆచార్య చాణక్యుడు

అలాగే చాణక్యుడు ఒక వ్యక్తి గౌరవాన్ని తగ్గించే విషయాలు, అలాగే సమాజంలో ఒక వ్యక్తి పదే పదే ఎందుకు అవమానాలు ఎదుర్కొంటాడు అనేది వివరించాడు.

అవమానాలు ఎదుర్కోవడం

కొన్ని సార్లు మన అలవాట్లే మన అవమానానికి కారణం కావచ్చును, అందువలన వాటిని సకాలంలో గుర్తించి సరి చేసుకుంటే, సమాజంలో మీ గౌరవాన్ని మీరు తిరిగి పొందుతారంట.

గౌరవం పొందడం

చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే నిరంతరం ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటారో, వారు  మర్యాదగా ఉండటం తమ బలహీనతగా పరిగణిస్తారు, క్రమంగా గౌరవం కోల్పోతారు.

ఇతరులను సంతోష పెట్టడానికి ప్రయత్నించడం

కొంత మంది తెలిసి, తెలియక, తమ బలహీనతలను అందరికీ చెబుతారు, ఇదే ఎదుటి వారికి బలంగా మారి, మిమ్మల్ని పదే పదే ఎగతాలి చేస్తారు.

బలహీనతలను తెలియజేయడం

చెడు స్వభావం ఉన్న వ్యక్తులతో కలిసి ఉండటం వలన కూడా మీరు నిరంతరం ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.

చెడు స్వభావం ఉన్న వ్యక్తులతో కలిసి ఉండటం

అలాగే కొంత మంది కోపంలో కానీ, తొందరలో కానీ ఆలోచించకుండా మాట్లాడుతుంటారు, ఈ అలవాటే దీర్ఘకాలంలో సమస్యలకు కారణం అవుతుందంట.

ఆలోచించకుండా మాట్లాడటం

పొరపాటుగా మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బ తియ్యడమే కాకుండా, మీపై అగౌరవ భావనను పెంచుతాయంట.

అగౌరం పెంచడం