Pawan kalyan – Sharmila Party: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీపై జనసేనాని రియాక్షన్
'వైయస్ఆర్‌టీపీ' పేరిట తెలంగాణలో వైయస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు.
Pawan kalyan – Sharmila Party: ‘వైయస్ఆర్‌టీపీ’ పేరిట తెలంగాణలో వైయస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీపై జనసేనాని పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గా స్పందించారు. కొత్త పార్టీ ఎవరు పెట్టినా మంచి పరిణామమేనన్న జగన్.. షర్మిలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కొత్త పార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలలన్నారు పవన్. కొత్త పార్టీ పెడుతున్న షర్మిలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నిర్మాణం చాలా కష్ట సాధ్యమైన పనని చెప్పిన పవన్.. అయినప్పటికీ కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్న వాళ్లే కాకుండా ఇతరులు కూడా పాలిటిక్స్ లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తెలంగాణ గడ్డ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావడం ఈ దేశానికి అత్యావశ్యకమని పవన్ అభిప్రాయపడ్డారు. అలాంటి వారిని జనసేన గుర్తించి ప్రోత్సాహిస్తుందని పవన్ వెల్లడించారు.
కాగా, నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల ఈ సాయంత్రం తెలంగాణలో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రతువుకు సంబంధించి ఇప్పటికే షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌లో నివాళులు అర్పించి హైదరాబాద్ బయలు దేరారు. పంజాగుట్టలోని వైయస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించి సాయంత్రం పార్టీ ప్రకటన చేయనున్నారు.