YS Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. మరికాసేపట్లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో మరికాసేపట్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ షర్మిల ఇవాళ తన కొత్త పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించబోతున్నారు.

YS Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. మరికాసేపట్లో పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటన
Ys Sharmila
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 08, 2021 | 3:29 PM

YS Sharmila Launch New Political Party: తెలంగాణ రాష్ట్రంలో మరికాసేపట్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇవాళ తన కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ప్రజల కలసాకారం కావాలంటే, రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొస్తామంటూ కొత్త పార్టీని తీసుకువస్తున్నారు. దీనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ(వైఎస్ఆర్టీపీ)గా తన పార్టీకి నామాకరణం చేశారు.

పార్టీ పేరు, జెండా, ఎజెండాను గురువారం సాయంత్రం వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించనున్నారు. అంతకుముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేస్తారు. వైఎస్‌కు నివాళులర్పించిన తర్వాత కడప నుంచి ప్రత్యేక విమానంలో మరికాసేపట్లో బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయ కళాకారులతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.

పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన, లక్ష్యాలు, ఎజెండాపై గంటా 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు కోర్ టీంగా నిలిచిన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి తదితరులు సభావేదికపై నుంచి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకోనున్నారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. Read Also…  Jagan bail cancellation case: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా.. తాజా వివరాలు ఇలా ఉన్నాయి