Jagan bail cancellation case: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా.. తాజా వివరాలు ఇలా ఉన్నాయి

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. 

Jagan bail cancellation case: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా.. తాజా వివరాలు ఇలా ఉన్నాయి
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 3:41 PM

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ..  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై ఈనెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజుతోపాటు.. సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు జగన్, రఘురామ కోర్టులో లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించారు.  లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పారు. దీంతో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీఎం జగన్  ప్రస్తుతం బెయిల్‌పై బయటున్నారు. అయితే జగన్ బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ లబ్ది చేకూరుస్తున్నారని, సాక్ష్యులను బెదిరించేందుకు, ప్రభావితం చేసేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ పిటిషన్‌లో వెల్లడించారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు. ముఖ్యంగా, జగన్ కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు.

రఘురామపై వేటు వేయాలంటున్న వైసీపీ

తాజాగా  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు కోరుతూ సవరించిన పిటిషన్ అందజేశారు. పిటిషన్ కు జతగా తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా సమర్పించారు.

Also Read:  మళ్లీ కలవరపెడుతున్న కరోనా కేసులు.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక లేఖలు.. కఠినంగా వ్యవహరించాలని సూచన

 ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. కీలక ప్రకనటన చేసిన IMD