Weather Report: ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. కీలక ప్రకనటన చేసిన IMD

తెలంగాణా రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టము..

Weather Report: ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. కీలక ప్రకనటన చేసిన IMD
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2021 | 2:57 PM

తెలంగాణా రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టము నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ(IMD) అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర ఒడిస్సా, పశ్చిమబెంగాల్ లలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు.

తెలంగాణలో విస్తారంగా వర్షాలు..

ఈరోజు ఉత్తర దక్షిణ ఉపరితలంలోని ఉత్తర కోస్తా ఒడిశా నుండి దక్షిణ కోస్తా  తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల దూరంలో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని … మరో 24 గంటల్లో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల , నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిషాయని, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో..

ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలోని కొన్ని చోట్ల ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది . ఇక గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల.. భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కురుస్తాయని వెల్లడించింది . గురు, శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ కేంద్రం.

ఈ నెల 11న అల్పపీడనం..

ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడనుంది. ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.

పిడుగుల వర్షం..

ఇదిలావుంటే.. పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. సీజన్ ఆరంభంలోనే పదుల సంఖ్యలో ప్రాణనష్టం కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో పడ్డ పిడుగులకు మనుషులు, పశువులు మృత్యువాత పడితే.. జోరున కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరదలతో చెరువు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..