Welfare Jobs In Kadapa: 5వ తరగతి పాసైన వారికి గుడ్ న్యూస్.. ఎటువంటి పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం
Welfare Jobs In Kadapa: ఐదవ తరగతి, ఏడవ తరగతి పాసైన కడప జిల్లా వాసులకు శుభవార్త. కేవలం కేవలం 5వ తరగతి, 7వ తరగతి పాసైన వారికి ఎటువంటి పరీక్ష లేకుండా..
Welfare Jobs In Kadapa: ఐదవ తరగతి, ఏడవ తరగతి పాసైన కడప జిల్లా వాసులకు శుభవార్త. కేవలం కేవలం 5వ తరగతి, 7వ తరగతి పాసైన వారికి ఎటువంటి పరీక్ష లేకుండా ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా సాంఘిక సంక్షేమ విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://kadapa.ap.gov.in/ లను చూడాల్సి ఉంది. మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనుంది. వాచ్‌మెన్ / ఆఫీస్ వాచర్ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎక్స్‌సర్వీస్‌మెన్ లేదా హోంగార్డ్ లేదా సివిల్ డిపెన్స్‌లో శిక్షణ పొంది ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి .ఈ రోజు నుంచి (జూలై 07) నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 12, 2021. అభ్యర్థులు నేరుగా అప్లికేషన్లను అందించాల్సి ఉంది. aplication form
జాబ్ రోల్: ఆఫీస్ సబార్డినేట్ , వాచ్‌మెన్ , ఆఫీస్ వాచర్ మొత్తం ఖాళీలు : 7 అర్హత : పోస్టుల్ని అనుసరించి ఐదు, ఏడో తరగతి ఉత్తీర్ణత వయస్సు : 01.07.2021 నాటికి 18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం : నెలకు రూ. 10,000 – 15,000 /- ఎంపిక విధానం: ఐదు, ఏడు తరగతుల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేరుగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు
దరఖాస్తులను ఇవ్వాల్సిన చిరునామా :
సాంఘిక సంక్షేమ విభాగం వైఎస్సార్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్
Also Read: బూట్లు తడుస్తాయని నీళ్లలో దిగని మంత్రి అనితా .. మత్స్యకారులు భుజాలపై మోసుకెళ్లిన వైనం