AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt. Alert on Corona: మళ్లీ కలవరపెడుతున్న కరోనా కేసులు.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక లేఖలు.. కఠినంగా వ్యవహరించాలని సూచన

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నవేళ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 8 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు లేఖ రాసింది కేంద్ర సర్కార్.

Govt. Alert on Corona: మళ్లీ కలవరపెడుతున్న కరోనా కేసులు.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక లేఖలు.. కఠినంగా వ్యవహరించాలని సూచన
Coronavirus
Balaraju Goud
|

Updated on: Jul 08, 2021 | 3:04 PM

Share

Union Govt.Letter to 8 States on Covid19 Control: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నవేళ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 8 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు లేఖ రాసింది కేంద్ర సర్కార్.

ఒక వైపు పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇంతకాలం మూత వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుకోవడంతో స్తంభించిన జన జీవనం ఇప్పుడిప్పుడే గాడిలోపడుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పరిస్థితి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు చూస్తుంటే ఆందోళనకరంగానే ఉంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రతీ రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని..కరోనా నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పలు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖలు రాసారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఈ రాష్ట్రాలను కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందస్తు మెచ్చరికలు పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు సామూహిక ప్రయత్నాలు అత్యవసరమని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో కరోనా వ్యాప్తి రేటు అత్యధికంగా 19 శాతం ఉన్నా.. పాజిటివిటీ రేటును 10 శాతానికిపైగా ఉంది. ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. వారానికి 12 శాతం కొత్త కేసులు నమోదు అవుతున్నాయని దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, మణిపూర్‌లోని 16 జిల్లాలో కూడా కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు. మేఘాలయలో కరోనా వ్యాప్తి రేటు 14.05 శాతంగా ఉన్నదని, అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. అస్సాంలో కూడా కేసులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా కొత్తకేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కసారిగా 26 శాతం అధికంగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్ పూర్తి అయ్యిందనుకుంటున్న సమయంలో కొత్త కేసులు ఒకే రోజులో పెరగడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 43,733 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక, భారత ఆరోగ్య శాఖ అందించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం దేశంలో కరోనా కేసులు సంఖ్య 3,06,63,665 కు చేరుకుంది.

Read Also…. Windows Security Update: విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ పీసీని అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగే నష్టం ఇదే..!