Lambda Variant: ఇండియాలో లాంబ్డా వేరియంట్ కేసులు లేవు..ఆందోళన అనవసరమన్న కేంద్రం
ప్రమాదకరమైన లాంబ్డా వేరియంట్ కేసులు ఇండియాలో లేవని, ఆందోళన అనవసరమని కేంద్రం తెలిపింది. ఈ కొత్త స్ట్రెయిన్ గత నాలుగు వారాల్లో 30 దేశాల్లో కనుగొన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెరూ లో ప్రారంభమైన ఈ వేరియంట్.. మరిన్ని దేశాలకు విస్తరించింది. పెరూ లో గత మే-జూన్ నెలల
ప్రమాదకరమైన లాంబ్డా వేరియంట్ కేసులు ఇండియాలో లేవని, ఆందోళన అనవసరమని కేంద్రం తెలిపింది. ఈ కొత్త స్ట్రెయిన్ గత నాలుగు వారాల్లో 30 దేశాల్లో కనుగొన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెరూ లో ప్రారంభమైన ఈ వేరియంట్.. మరిన్ని దేశాలకు విస్తరించింది. పెరూ లో గత మే-జూన్ నెలల కాలంలో 82 శాతం కేసులు ఈ వేరియంట్ కారణంగా నమోదైనవేనని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. బ్రిటన్ లో కూడా ఈ కేసులు ఉన్నాయని, అయితే ఇది వేగంగా వ్యాపిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉందని ఈ సంస్థ పేర్కొంది. యాంటీ బాడీలను ఇది న్యూట్రలైజ్ చేయగలదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ స్పష్టం చేయగా.. దీన్ని ఇప్పుడే నిర్ధారించజాలమని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడింది. లాటిన్ అమెరికా దేశాల్లోనూ. కరీబియన్ దీవుల్లోనూ లాంబ్డా కేసులు ఎక్కువగా ఉన్నట్టు ఈ సంస్థలు వెల్లడించాయి. పెరూ తో బాటు , చిలీ, ఉరుగ్వే దేశాల్లో ఈ వేరియంట్ ఉందని, అయితే ఇండియా సహా కొన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పరిగణించింది. అంత మాత్రాన నిర్లక్ష్య వైఖరి పనికి రాదని కూడా సూచించింది. ఇప్పటివరకు భారత అధికారులు దీని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ దీనిపై రీసెర్చ్ జరుగుతోంది. ఏ పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాపిస్తుందన్న విషయంలో అధ్యయనం చేస్తున్నారు. ఆశ్చర్యంగా పెరూ, చిలీ దేశాల్లో ఈ వైరస్ కి గురైన 12 ఏళ్ళ పిల్లలు కొందరికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారట..
మరిన్ని ఇక్కడ చూడండి : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.