Potina Venkata Mahesh : ‘ఈ డ్రామాలేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ.. వాటిపై మీకు రాజకీయం తగునా?’ : జనసేన ప్రతినిధి పోతిన
శివస్వామిగారికి.. బ్రహం గారి మఠంకు ఏం సంబంధం అన్నారు.. నేడు ఏ ప్రాతిపదికన వారి వద్ద నివేదిక తీసుకున్నారు" అని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి..
Potina Venkata Mahesh Janasena : “శివస్వామిగారికి.. బ్రహం గారి మఠంకు ఏం సంబంధం అన్నారు.. నేడు ఏ ప్రాతిపదికన వారి వద్ద నివేదిక తీసుకున్నారు” అని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ప్రశ్నించారు జనసేన ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ డ్రామాలు ఏంటీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ..! అని ప్రశ్నించిన పోతిన.. పీఠాలపై మీకు రాజకీయం తగునా? అని అడిగారు.
శివస్వామిగారికి బ్రహం గారి మఠంకు ఏం సంబంధం అని ప్రశ్నించిన మీరు ఒక్కసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోండని సూచించారు. రాజకీయాలు చేసి బ్రహ్మంగారి భక్తులను అనవసర ఆందోళనకు గురి చేయొద్దని పోతిన.. ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోందని జనసేన పార్టీ విమర్శించింది. రైతుల నుంచి ధాన్యం కొని ఇన్నాళ్లైనా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ములు ఇంకా చెల్లించలేదని జనసేన ఆరోపించింది. రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది.
Read also : CM YS Jagan – Chiranjeevi: చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్