నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేదు.. పుదుచ్చేరి పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేసిన ..
Rahul Gandhi Coments : తన తండ్రి రాజీవ్‌గాంధీని చంపిన వారిపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం లేవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. పుదుచ్చేరి
Rahul Gandhi Coments : తన తండ్రి రాజీవ్‌గాంధీని చంపిన వారిపై తనకు ఎలాంటి కోపం, ద్వేషం లేవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ వారు హత్య చేసిన విషయమై ఓ విద్యార్థిని మాట్లాడుతూ ‘దోషులపై కోపం ఉందా?’ అని అడిగారు. దానికి రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘మా తండ్రిని హత్యచేయడం తీవ్రంగా బాధించింది. కానీ ఇప్పుడు ఆ దోషులపై ఎలాంటి కోపం, ద్వేషం లేవన్నారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని రాహుల్‌గాంధీ ఆటోగ్రాఫ్ తీసుకుని భావోద్వేగానికి గురికాగా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అంతకుముందు సీఎం నారాయణస్వామి సహా పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సోలైయూర్ ప్రాంతంలో మత్స్యకారులతో మాట్లాడుతూ… ఓ పక్క పిల్లలను బడికి పంపలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు రూ.పది లక్షల కోట్లను రుణాలుగా ఇచ్చిందని ఆరోపించారు.