కుప్పం నుంచి కూడా చంద్రబాబుని పీకిపడేసి తరిమికొట్టారు, ఇకనైనా ఆయన జగన్‌కు మద్దతివ్వాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కుప్పంలో టీడీపీకి భంగపాటు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కుప్పంలో టీడీపీకి భంగపాటు జరిగిందని, చంద్రబాబును మనువడితో ఆడుకోవాలని ప్రజలు ఇంటికి పంపించేశారని రోజా హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ వెళ్ళి జగన్ ఏం పీకారని చంద్రబాబు మాట్లాడారని, కానీ కుప్పం నుంచి ఆయనను ప్రజలు పీకేశారని ఇకనైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా అన్నారు.
వెన్నుపోటు, కుళ్లు కుతంత్రాలతో ఇన్నాళ్లూ మోసం చేస్తున్న చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించిన కుప్పం ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛీకొట్టారని ఆమె చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో 90% టీడీపీని వ్యతిరేకించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారని ఇది విశ్వాసం, నమ్మకానికి సంకేతమని ఆమె స్పష్టం చేశారు. బినామీ ఓట్లతో చక్రం తిప్పుతున్న బాబుకు ఈ ఫలితాలతో ప్రజలు షాక్ ఇచ్చినట్లు చెప్పారు.