AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shabnam case: దేశంలో తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష..? రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరణ.. ఆదేశాలు జారీ చేసిన మధుర కోర్టు..

స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశంలో ఓ మహిళను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ

Shabnam case: దేశంలో తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష..? రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరణ.. ఆదేశాలు జారీ చేసిన మధుర కోర్టు..
uppula Raju
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 18, 2021 | 11:39 AM

Share

స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశంలో ఓ మహిళను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ మహిళను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాలని మథుర కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. మథురకు చెందిన షబ్నమ్‌ అనే మహిళ సలీం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అనంతరం శారీరక సంబంధానికి దారితీసింది. పెళ్లికి ముందే షబ్నమ్‌ దారితప్పడంతో కుటుంబ సభ్యలు గట్టిగా మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని షబ్నమ్‌ సలీంను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కోసం కుటుంబ సభ్యుల అనుమతిని కోరింది. దీని వారు నిరాకరించడంతో పాటు షబ్నమ్‌ను గృహనిర్బంధం చేశారు. దీంతో కుటుంబ సభ్యులపై కక్షపెంచుకున్న షబ్నమ్‌ ప్రియుడు సలీంతో కలిసి 2008 ఏప్రిల్‌ 14న అర్థరాత్రి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. ఐదు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్‌ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది. అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్‌, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్‌ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. కాగా కాగా బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు.

Today Slive Price: బంగారం బాటలోనే వెండి.. దేశవ్యాప్తంగా తగ్గిన సిల్వర్‌ ధరలు.. ఎంత తగ్గిందంటే..