Hardik Patel: బీజేపీలో చేరడం లేదు.. ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పటేల్..
కాంగ్రెస్ అతిపెద్ద కులతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్‌లో గురువారం హార్ధిక్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక చీఫ్‌గా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని..
గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలిన హార్దిక్ పటేల్(Hardik Patel) తనపై వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీపై(Congress) విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అతిపెద్ద కులతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్‌లో గురువారం హార్ధిక్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక చీఫ్‌గా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు కేవలం పేపర్‌పైనే అని.. రెండేండ్ల పాటు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టారని అన్నారు. అయితే తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. కమలం పార్టీలో చేరికపై బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. బీజేపీలో చేరడంపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని తమ సామాజిక వర్గం పటిదార్ నేతలు హెచ్చరించారని.. వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. వారు తనను కాంగ్రెస్‌లో చేరవద్దని ఎందుకు చెప్పారో ఇప్పుడు తనకు అర్ధమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ హాజరైన దహోద్ ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీకి 25,000 మంది హాజరైతే.. 70 వేల మంది వచ్చారని ఖర్చుల కోసం బిల్లులు సమర్పించారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా అవినీతి జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడకు వస్తే ఆయనకు ఎలాంటి చికెన్ శాండ్‌విచ్ ఇవ్వాలి.. డైట్ కోక్ ఎలా ఉండాలనే దానిపై నేతలు చర్చిస్తుంటారని ఇదేక్కడి పద్దతని ప్రశ్నించారు. కుల రాజకీయాలు మినహా వారి నుంచి మరొకటి ఆశించవద్దని తనకు ఇప్పుడు తెలిసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతుందని హార్దిక్ పటేల్ ఆరోపించారు.
I wasted 3 yrs of my political life in Congress. If I had been not in Congress I could have worked better for Gujarat. Neither did I ever get an opportunity to work while being in the party nor did Congress give me any work: Hardik Patel after resigning from Congress y’day pic.twitter.com/Du49B5sh6N
— ANI (@ANI) May 19, 2022
ఇంతకుముందు హార్దిక్ పటేల్ తన రాజీనామాను ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీంతో పాటు సోనియా గాంధీకి రాసిన లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ కేవలం నిరసన రాజకీయాలకే పరిమితమైందని ఈ లేఖలో హార్దిక్ ఆరోపించారు. అంతేకాదు ఇందులో రాహుల్ గాంధీని కూడా తీవ్రంగా టార్గెట్ చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హార్దిక్ నిష్క్రమణ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.