యోగి కోటను బద్దలు కొట్టిన నేత.. బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ : బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం కంచుకోట లాంటిది. గతంలో ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ స్థానం. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఈ స్థానానికి రాజీనామా చేయడంతో గతేడాది ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే ఆ స్థానంలో గెలిచిన ప్రవీణ్ నిషాద్ ఇవాళ కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి జేపీ […]

యోగి కోటను బద్దలు కొట్టిన నేత.. బీజేపీలో చేరిక
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 9:13 PM

న్యూఢిల్లీ : బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం కంచుకోట లాంటిది. గతంలో ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ స్థానం. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఈ స్థానానికి రాజీనామా చేయడంతో గతేడాది ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలపడంతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే ఆ స్థానంలో గెలిచిన ప్రవీణ్ నిషాద్ ఇవాళ కమలం గూటికి చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకొన్నారు. అయితే బీజేపీ మళ్లీ గోరఖ్‌పూర్ స్థానాన్ని  కైవసం చేసుకోవడానికి నిషాద్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో నిషాద్ పార్టీ మహా కూటమికి మద్దతిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అది జరిగిన 48 గంటల్లోనే ప్రవీణ్ నిషాద్ పార్టీని వీడారు. ప్రవీణ్ నిషాద్ తండ్రి సంజయ్.. నిషాద్ పార్టీ అధినేత. ప్రవీణ్ బీజేపీలో చేరినా, ఆయన తండ్రి నిషాద్ పార్టీని నడిపించనున్నారు. అంతేకాదు నిషాద్ పార్టీ యూపీలో బీజేపీకి మద్దతివ్వనుంది. గోరఖ్ పూర్‌ లోక్‌సభ నియోజవకవర్గంలో నిషాద్ సామాజికవర్గానికి చెందిన ఓబీసీలు సుమారు 3.5లక్షల మంది ఉంటారని అంచనా. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా పడితే బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూడా ఎస్పీ తరఫున నిషాద్ సామాజికవర్గానికే చెందిన ఓ నేతను అభ్యర్థిగా ప్రకటించారు.