వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిరోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అమరావతి వేదికగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు… నవరత్నాలన్నింటిని జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇవాళ రేపు అంటూ సాగిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు జగన్. […]

వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 9:31 PM

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిరోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అమరావతి వేదికగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు… నవరత్నాలన్నింటిని జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇవాళ రేపు అంటూ సాగిన వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు జగన్. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేతలు మేకపాటి, ధర్మాన, బోత్సతో పాటు పలువురికి చోటు కల్పించారు.

మేనిఫెస్టోలో ప్రధానంగా అమలుకు హామీ కాని వాగ్ధానాలకు పార్టీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వాగ్ధానాల విషయంలో ఏ పార్టీతో పోటీ పడకుండా మేనిఫెస్టో రూపొందించాలని జగన్ మేనిఫెస్టో కమిటీకి గతంలోనే సూచించారు. దీంతోపాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టో డ్రాప్ట్‌ని పరిశీలించిన వైసీపీ.. అంతకుమించిన అద్భుతమైన మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో జగన్ ఇస్తున్న ఏ ఒక్క హామీని వదలకుండా అన్నింటిని మేనిఫెస్టోలో చేర్చాల్సిందేనని జగన్ సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది.