సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
Free Electricity For Salons And Laundries : తెలంగాణ రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ రెండు వర్గాల కార్మికులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న ఉచిత కరెంట్ సరఫరాను
Free Electricity For Salons And Laundries : తెలంగాణ రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ రెండు వర్గాల కార్మికులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్న ఉచిత కరెంట్ సరఫరాను ప్రభుత్వం అంగీకరించింది. బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై పలువురు మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆదివారం జీవో విడుదలచేయడం సంతోషకరమని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కిశోర్‌గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కులవృత్తులకు అనేక రాయితీలు కల్పించి ప్రోత్సహించడం గొప్ప విషయమని కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు బడుగు బలహీనవర్గాల ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.