Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cash Prize For Volunteers : ఏపీ వాలంటీర్లకు శుభవార్త.. ఉగాది కానుకగా నగదు పురస్కారం.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..

Cash Prize For Volunteers : ఏపీలో పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారంతో

Cash Prize For Volunteers : ఏపీ వాలంటీర్లకు శుభవార్త.. ఉగాది కానుకగా నగదు పురస్కారం.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..
Cash Prize For Volunteers
Follow us
uppula Raju

|

Updated on: Apr 05, 2021 | 5:41 AM

Cash Prize For Volunteers : ఏపీలో పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు నగదు పురస్కారంతో సత్కరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేరిట మూడు కేటగిరీల్లో ఈ అవార్డులు అందజేయనుంది. సేవావజ్రకు రూ. 30 వేలు, సేవారత్నకు రూ. 20 వేలు, సేవామిత్రకు రూ. 10 వేలు నగదు పురస్కారం, శాలువాతో సత్కరించనుంది. అయితే ఇందుకోసం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోనుంది.

మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు అందజేస్తారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.10 వేలు నగదు, ప్రసంశా పత్రం, శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు.

రెండో కేటగిరీలో 4000 మంది వాలంటీర్లకు ‘సేవా రత్న’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున, కార్పొరేషన్లలో పది మంది చొప్పున మొత్తం 4,000 మంది వాలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్తో సత్కరించనున్నారు.

మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు ‘సేవా వజ్ర’అవార్డు ఇస్తారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం వంటి కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరిస్తారు.

చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే రాజకీయాల్లోకి వచ్చా..! అభిమానులు లేకపోతే పవన్‌ కల్యాణ్ లేడు.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వకీల్‌ సాబ్‌..

కనిపించదే.. మాయం అయ్యిందే.. లోగోపై అభ్యంతరం.. ఆ క్రికెటర్ జెర్సీ మార్చిన సీఎస్కే యాజమాన్యం..

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కోపం మంచిదేగా.. రిఫరీపై ఆగ్రహం.. అది ఎందరికో సహాయంగా మారింది..