కోవూరులో మద్యం మత్తులో ఏఎస్పీ వీరంగం.. హోటల్ సిబ్బంది, బాటసారులపై దాడి.. మండి పడుతున్న స్థానికులు
ASP Sridhar Babu Assaults :పశ్చిమగోదావరి జిల్లాలోని కోవూరులో ఓ హోటల్ దగ్గర స్థానిక ఏఎస్పీ హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో హోటల్ సిబ్బంది బాటసారులపై దాడికి తెగబడ్డాడు. దీంతో స్థానికులు ఆగ్రహం

Asp Sridhar Babu Assaults
ASP Sridhar Babu Assaults : నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఓ హోటల్ దగ్గర స్థానిక ఏఎస్పీ హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో హోటల్ సిబ్బంది బాటసారులపై దాడికి తెగబడ్డాడు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్పీ వాహనాన్ని ధ్వంసం చేశారు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఎస్పీ శ్రీధర్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోవూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఫుల్‌గా మద్యం సేవించి ఇష్టారీతిన వ్యవహరించడం సబబుకాదన్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.