ఇంట్లో గొడవ పడ్డ ఓ యువతి.. నేరుగా వచ్చి గోదావరి నదిలో దూకింది.. అంతలో ఎం జరిగిందంటే..?

చిన్నపాటి గొడవలకే కొందరు కలత చెందుతున్నారు. మానసికంగా వేదనకు గురవుతున్నారు. జీవితంపై విరక్తి పెంచుకుని ప్రాణాలనే బలితీసుకుంటున్నారు.

ఇంట్లో గొడవ పడ్డ ఓ యువతి.. నేరుగా వచ్చి గోదావరి నదిలో దూకింది.. అంతలో ఎం జరిగిందంటే..?
Young Woman Who Attempted Suicide Saved By Police

Young woman attempted suicide: చిన్నపాటి గొడవలకే కొందరు కలత చెందుతున్నారు. మానసికంగా వేదనకు గురవుతున్నారు. జీవితంపై విరక్తి పెంచుకుని ప్రాణాలనే బలితీసుకుంటున్నారు. ఇదేక్రమంలోనే ఇటీవల ఆత్మహత్యాయత్నం వంటి కేసులు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి.. కుటుంబ కలహాలతో కలత చెందింది. అంతే ఇక ఈ జీవితం వేస్టు అనుకుంది. అనుకున్నదే తడువుగా.. ఇలా వచ్చి గోదావరి నదిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని కాపాడటంతో ప్రమాదం తప్పింది.

పెద్దపల్లి జిల్లా 8 ఎన్‌క్లేవ్‌కు చెందిన ఓ యువతి.. ఇంట్లో ఏదో విషయంలో గొడవ జరిగింది. వెంటనే ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఇలా గోదావరి నది దగ్గరకు వచ్చి బ్రిడ్జి పై నుంచి దూకింది. అటుగా వెళ్తున్న వారు ఇది గమనించారు. యువతి మునిగిపోవడాన్ని చూసి.. అక్కడే కొద్ది దూరంలో ఉన్న పెట్రోలింగ్‌ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు కూడా బోటు వేసుకుని నిమిషాల్లోనే యువతి మునిగిపోయిన ప్రాంతానికి చేరుకుని రిస్య్కూ చేసి కాపాడారు. రివర్‌ చెక్‌పోస్టు పోలీసులు ఆ టైంలో అక్కడ లేకుంటే యువతి ప్రాణాలతో దక్కేదే కాదని స్థానికులు తెలిపారు.

నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకని అభిప్రాయపడ్డారు. చెక్‌పోస్టు పోలీసులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, అడ్వెంచర్‌ అండ్‌ ఆక్వా టూరిజం సభ్యులు.. ప్రాణాలకు తెగించి ఆ యువతిని కాపాడారు. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని చికిత్స నిమిత్తం గోదావరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read Also… మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం… రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్.. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్ మూసివేత..!