AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌ కల్యాణ్ ఓ వ్యసనం.. అలవాటైతే చనిపోయే వరకు వదల్లేం.. వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌ మాటలు..

Bandla Ganesh Coments : పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటించిన కొత్త సినిమా వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరుగుతోంది. కార్యక్రమానికి హీరోపవన్‌ కల్యాణ్, ఇతర నటీనటులు దర్శక, నిర్మాతలు తదితరులు

పవన్‌ కల్యాణ్ ఓ వ్యసనం.. అలవాటైతే చనిపోయే వరకు వదల్లేం.. వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌ మాటలు..
Bandla Ganesh
uppula Raju
| Edited By: Rajitha Chanti|

Updated on: Apr 05, 2021 | 3:41 PM

Share

Bandla Ganesh Coments : పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ నటించిన కొత్త సినిమా వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరుగుతోంది. కార్యక్రమానికి హీరోపవన్‌ కల్యాణ్, ఇతర నటీనటులు దర్శక, నిర్మాతలు తదితరులు హాజరయ్యారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 9 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ పవన్‌ కల్యాణ్ గురించి మాట్లాడుతూ మరోసారి తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు.

ముందుగా ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా  అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు బండ్ల గణేశ్. ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్తకన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు.. పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌’ అని సగర్వంగా చెప్పుకొంటానని నటుడు నిర్మాత బండ్లగణేశ్‌ అన్నారు. ‘పవన్‌కల్యాణ్‌ ఒక వ్యసనం. అలవాటైతే చనిపోయే వరకూ వదల్లేం. ఈ సినిమా గురించి మాట్లాడమని పిలిచారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. చాలా మంది పుడతారు.. చనిపోతారు కానీ కొందరే చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ సినిమా తర్వాత సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు పవన్‌కల్యాణ్‌.

ఒక ఐఏఎస్‌ దగ్గరకు వెళ్లి, ‘సర్‌ మీరు పదో తరగతి బాగా చదివారు’ అని అంటే ఎలా ఉంటుందో.. పవన్‌ సినిమా గురించి మాట్లాడినా అలాగే ఉంటుందని చమత్కరించారు. ఆయన చూడని హిట్లా.. బ్లాక్‌బస్టర్లా.. ఆయన ఒక నాందికి శ్రీకారం చూట్టారు. ఆయన కళ్లలో నిజాయతీ ఉంది. నేను నిజంగా పవన్‌కల్యాణ్‌ భక్తుడనని సగర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. ఆయన మాట్లాడిన మాటలను పవన్‌ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ప్రాంగణమంతా చప్పట్లతో మారు మ్రోగింది.

Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని అంటుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ హోప్ ఇచ్చారు .. వకీల్ సాబ్ హీరోయిన్..

David Warner IPL 2021: సన్‌రైజర్స్ రన్ మెషిన్.. ఢిల్లీ టు హైదరాబాద్.. వార్నర్ ఎక్కడుంటే అక్కడే విజయం..