టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా.. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్‌టీయూ..
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్‌టీయూ సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని పూల రవీందర్ ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. మనకు టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు. పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read more:
అమిత్‌షాను కలిసిన జనసేనాని.. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలొద్దని వాదించిన వకీల్‌సాబ్
నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.. 13 లిఫ్ట్ ఇరిగేషన్లకు భూమిపూజ