నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.. 13 లిఫ్ట్ ఇరిగేషన్లకు భూమిపూజ
నెల్లికల్‌లో 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
CM KCR Neelikallu Inauguration : నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం.. నందికొండకు చేరుకున్నారు. సీఎంకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నందికొండ నుంచి రోడ్డుమార్గాన నెల్లికల్‌కు చేరుకున్న నెల్లికల్‌లో 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.