CM KCR Nellikal Inauguration Live : సాగునీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. హాలియాలో ముఖ్యమంత్రి ప్రసంగంపై ఆసక్తి
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో..
CM KCR Nellikal : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ చివరి భూములతో పాటు ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇటీవల రూ.3వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా జిల్లాలో 55వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది. దీంతో ఆయా సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ లకు నేడు ముఖ్యమంత్రి సాగర్ లోని నెల్లికల్ వద్ద శంఖుస్ధాపన చేశారు.
నల్లగొండ జిల్లా ప్రజలకు ఈపథకాలు అందించినందుకు కృతజ్ఞతగా హాలియాలో భారీ ధన్యవాద సభ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో ఉదయం 11.40కి బయలుదేరి మధ్యాహ్నం 12.30కి హాలియాకు చేరుకున్నారు. సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల పరిధిలోని నెల్లికల్లు గ్రామంలో ఎత్తిపోతల పథకంతోపాటు ఉమ్మడి జిల్లాకు మంజూరైన మరో ఎనిమిది ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.
ఆ తరువాత నాగుర్జునసాగర్ లోని హిల్‌కాలనీలోని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం అనంతరం మద్యాహ్నం మూడున్నర గంటలకు హాలియా వద్ద ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం తిరిగి హెలికాఫ్టర్ ద్వారా 5గంటలకు బేగంపేట చేరుకుంటారు. ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటన నేపధ్యంలో అధికార పార్టీతో పాటు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే నెల రోజుల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం.
LIVE NEWS & UPDATES
-
Foundation Stone by CM KCR : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు
ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
-
నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర నాయక్‌తో పాలు పలువురు నాయకులు ఉన్నారు.
-
-
సీఎం కేసీఆర్‌కు నల్లగొండ జిల్లా నేతల ఘనస్వాగతం
సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నందికొండ నుంచి రోడ్డుమార్గాన నెల్లికల్‌కు చేరుకున్న నెల్లికల్‌లో 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
-
నాగార్జున సాగర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం.. నందికొండకు చేరుకున్నారు.
Published On - Feb 10,2021 3:08 PM