బిస్కెట్లలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య, కూతురి రూమ్‌కి గడియపెట్టి అర్థరాత్రి దారుణానికి ఒడిగట్టిన దంపతులు

దంపతులిద్దరూ బిస్కెట్లలో పురుగుల మందు కలుపుకొని వాటిని తిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగర శివారు మైలార్ దేవుపల్లి..

బిస్కెట్లలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య, కూతురి రూమ్‌కి గడియపెట్టి అర్థరాత్రి దారుణానికి ఒడిగట్టిన దంపతులు

దంపతులిద్దరూ బిస్కెట్లలో పురుగుల మందు కలుపుకొని వాటిని తిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగర శివారు మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్ కు చెందిన రమేష్ జోషి, రాజకన్య జోషి భార్యాభర్తలు. జోషి దంపతులు రెండేళ్ల నుంచి మైలార్ దేవుపల్లిలోని బృందావన్ కాలనీలో నివాసముంటున్నారు. భర్త రమేష్ జోషి ఎల్బీ నగర్ లోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తుండగా, భార్య హౌస్ వైఫ్. అయితే, నిన్న రాత్రి తమ కూతురుతో కలిసి భోజనం చేసి ఆపై ఎవరి రూమ్ లో వారు పడుకున్నారు.

తెల్లవారుజామున జోషి కుమార్తె లేచి చూసేసరికి తన గదికి బయట నుండి గడియ పెట్టి ఉంది. అరుపులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి డోర్ తీశారు. తన పేరెంట్స్ పడుకున్న గదికి వెళ్లి చూడగా తల్లిదండ్రులిద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. విషయం పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : ఢిల్లీలో పవన్ కళ్యాణ్ డిమాండ్

Click on your DTH Provider to Add TV9 Telugu