AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్‌షాను కలిసిన జనసేనాని.. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలొద్దని వాదించిన వకీల్‌సాబ్‌

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేటీకరించాలనే కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనల వేడి ఢిల్లీకి తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై..

అమిత్‌షాను కలిసిన జనసేనాని.. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలొద్దని వాదించిన వకీల్‌సాబ్‌
K Sammaiah
|

Updated on: Feb 10, 2021 | 1:02 PM

Share

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేటీకరించాలనే కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనల వేడి ఢిల్లీకి తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని, ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రైవేటీకరణను ఆపాలంటూ లేఖలో ప్రస్తావించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని పవన్ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టబడుల ఉపసంహరణకు కేంద్రం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనుమతి ఇచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే తెలుగు ప్రజల పోరాటానికి చిహ్నమన్నారు. స్టీల్ ప్లాంట్‌తో తెలుగు ప్రజలు ఎమోషనల్‌గా అటాచ్ అయి ఉన్నారన్న ఆయన.. 1960లో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం జరిగిన పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.

ప్లాంట్‌లో 18వేల మంది పర్మినెంట్ ఎంప్లాయిస్, 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సరిగా నడవకపోవడానికి సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడమే కారణం అన్నారు. SAIL లాంటి కంపెనీలకు వాటికి సొంత గనులు ఉన్నాయన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు ఎంతటి పోరాటానికైనీ సిద్ధమని పార్టీలు ప్రకటించాయి. రాష్ట్రంలో అధికార వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Read more:

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన అఖిలపక్షం కార్మికులు.. ఆయనేం మాట్లాడారు.. వీరికెందుకంత కోపం..?

గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు