ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన అఖిలపక్షం కార్మికులు.. ఆయనేం మాట్లాడారు.. వీరికెందుకంత కోపం..?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి విశాఖపట్నంలో చుక్కెదురైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన అఖిలపక్ష..

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన అఖిలపక్షం కార్మికులు.. ఆయనేం మాట్లాడారు.. వీరికెందుకంత కోపం..?
Follow us
K Sammaiah

|

Updated on: Feb 10, 2021 | 12:36 PM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి విశాఖపట్నంలో చుక్కెదురైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన అఖిలపక్ష ఆందోళనలో ఘర్షణ జరిగింది. ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రసంగాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ఉక్కు మంత్రి, ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయన్ని కలిసేలా ప్రయత్నిస్తానని విజయ్ సాయి రెడ్డి సర్ది చెప్పారు.

మనం ప్రయత్నం చేద్దాం…లక్ష్యం కొన్ని సార్లు నేర వేరవచ్చు..కొన్ని సార్లు నెరవేరకపోవచ్చు. దేనికైనా పట్టువిడుపు ఉండాలి అని అన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సీపీఎం నేతలు అభ్యంతరం తెలిపారు. మీకు నచ్చినా…నచ్చకపోయినా నేను చెప్పేది వాస్తవం అని విజయసాయి వాదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విజయసాయిరెడ్డి ప్రసంగానికి కార్మికులంతా ముకుమ్మడిగా అడ్డు తగిలారు.

దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి సహా మంత్రి అవంతి శ్రీనివాస్, మిగితా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెనుదిరిగారు. కాగా విజయసాయిరెడ్డి కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఎంపీ విజయసాయిరెడ్డని అక్కడి నుంచి పంపించి వేశారు.

Read more:

గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు