ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాకిచ్చిన హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డిని మాట్లాడనివ్వద్దన కేసు కొట్టివేత

మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని, మీడియాతో మాట్లాడనివ్వొద్దన్న నిమ్మగడ్డ ఆంక్షలను కొట్టేసింది హైకోర్టు.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాకిచ్చిన హైకోర్టు.. మంత్రి పెద్దిరెడ్డిని మాట్లాడనివ్వద్దన కేసు కొట్టివేత
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 10, 2021 | 12:23 PM

High Court serious on SEC : హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో షాక్‌ తగిలింది. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని, మీడియాతో మాట్లాడనివ్వొద్దన్న నిమ్మగడ్డ ఆంక్షలను కొట్టేసింది హైకోర్టు. మొన్ననే సింగిల్‌ జడ్జి బెంచ్‌… గృహ నిర్భంధ ఆదేశాలను కొట్టేసింది. మీడియాతో మాట్లాడొద్దన్న ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లారు పెద్దిరెడ్డి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. మీడియాతో మాట్లాడ వచ్చని స్పష్టం చేసింది.

ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పీల్‌పై హైకోర్టు ధర్మసనం విచారణ చేపట్టింది. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు పెద్దిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, మీడియాతో కూడా మాట్లాడవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో మళ్లీ అప్పీల్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మీడియాతో మాట్లాడవచ్చని వెల్లడించింది. మాట్లాడవద్దనడానికి రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తికరణ స్వేచ్ఛను హరించినట్లేనని పెద్ది రెడ్డి తరుపున న్యాయవాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై మంత్రి మరోసారి ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి… గతంలో వారికి పట్టిన గతే వీరికీ పడుతుందన్న మంత్రి అవంతి.. ఇంతకీ ఏమిటా గతీ.. ఎవరికీ శాపనార్థాలు

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?