Breaking: వైసీపీ కండువాను కప్పుకున్న మాజీ మంత్రి..!

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ రోజు సీఎం జగన్‌ను కలిసిన ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావడం ఒక మంచి పరిణామమని అన్నారు.

Breaking: వైసీపీ కండువాను కప్పుకున్న మాజీ మంత్రి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2020 | 7:56 PM

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ రోజు సీఎం జగన్‌ను కలిసిన ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావడం ఒక మంచి పరిణామమని అన్నారు. జగన్ పథకాలు మెచ్చి రామసుబ్బారెడ్డి పార్టీలో చేరారని.. ఆయన్ను మనస్ఫూర్తిగా సీఎం పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డి రాకతో తమ పార్టీకి మరింత బలం చేకూరిందని తెలిపారు.

ఇంకా చాలా మంది టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఈ ప్రభావం టీడీపీ పైన, చంద్రబాబు పైన తీవ్రంగా ఉంటుందని తెలిపారు. టీడీపీపై విశ్వాసం సన్నగిల్లుతుందని.. చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఆ పార్టీలో చాలామంది విశ్వాసం కోల్పోయారని అన్నారు. వైసీపీ ఎక్కడా దౌర్జన్యాలు చేయడం లేదని సజ్జల చెప్పుకొచ్చారు.

Read This Story Also: వరుస ఫ్లాప్‌లు.. బాలీవుడ్‌కు టాలీవుడ్‌ డైరక్టర్..!