సీఎం జగన్ టీమ్‌లోకి కొత్త ‘ఉప ముఖ్యమంత్రి’?
ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించే.. పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రిగా మత్య్స శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న..
ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించే.. పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రిగా మత్య్స శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న మోపిదేవి వెంకటరమణతో పాటు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ కూడా వైసీపీ తరపున రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎంతో పాటు రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక వేళ ఆయన రాజ్యసభకు వెళ్లిపోతే.. ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఉన్న వారితోనే జగన్ సరిపెడతారా? లేక కొత్తగా డిప్యూటీ మంత్రిని తీసుకుంటారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభకు ఎన్నికైతే.. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అలా అయితే ఇక నలుగురు డిప్యూటీ సీఎంలు మాత్రమే ఉంటారు. అంటే ఒక స్థానం ఖాళీ కానుంది. అయితే అందులో ఒకరి స్థానంలోకి ఎమ్మెల్యే రోజా వస్తారని గట్టిగా వినిపిస్తోంది. అందులోనూ.. గతంలో మంత్రి పదవి ఆశించారు కూడా. అలాగే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..
టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్
వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..
రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది
కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు