షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన అప్డేట్. వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్ ధర ₹200 నుండి ₹300కు పెరిగింది. సాధారణ పెయిడ్ బ్రేక్ దర్శనంతో ధరల వ్యత్యాసం లేకపోవడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సంస్థాన్ ట్రస్ట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి మధ్యాహ్నం నుంచే అమలులోకి వచ్చాయి.