AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్

పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా... మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స ఎంతసేపు జరిగిందంటే..? ప్రధాని నుంచి ఫోన్
Pawan Kalyan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 11:51 AM

Share

పదేళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. రెండు భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా… మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం (జూలై11) ముంబైలో విజయవంతంగా కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉండటంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ముందే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు సూచించడంతో తొలుత కుడి భుజానికే ఆపరేషన్ చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు వెల్లడించారు. ఎడమ భుజానికి రెండు నెలల తర్వాత మరో శస్త్రచికిత్స చేయనున్నారు.

పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయం అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోరాట యాత్ర, రైతు పర్యటనలు, వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు కరచాలనం చేయడం, చేతులు పట్టి లాగడం వంటి సందర్భాల్లో గాయాలు మరింత తీవ్రతరమైనట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ దెబ్బతినడంతో పాటు కండరాలు కూడా చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతోనూ ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్చర్యకరమని వైద్యులు వ్యాఖ్యానించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. కొద్ది రోజుల క్రితం ముంబైలో సమగ్ర పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్సకు నిర్ణయించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..