ఏడేళ్లుగా ప్రేమించిన అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన ఓ యువకుడు గ్రామమంతా పోస్టర్లు అంటించాడు. తమ ప్రేమ గురించి తెలిసినప్పటికీ, బంగారు ఆశతో పెళ్లి చేస్తున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నాడు. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ కాబోయే వరుడికి సలహాలు ఇస్తున్నారు. ఈ ఘటన వైరల్గా మారింది.