తెలంగాణ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది, పరీక్ష ఉండదు. గ్రేడింగ్ సిస్టమ్, మార్కుల కన్వర్షన్ పై ఎస్ఎస్సీ బోర్డు నుండి క్లారిటీ రాగానే నోటిఫికేషన్ విడుదలవుతుంది. అభ్యర్థులు టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ను అనుసరించాలి.