Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షలు రద్దు. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ . ఫెయిల్ అయిన విద్యార్థులంతా పాస్ అయినట్లు పాటించిన ఇంటర్ బోర్డు . కంపార్ట్మెంట్ లో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ లో పేర్కొననున్న బోర్డు . 1.47 లక్షల మంది విద్యార్థులకి ప్రయోజనం. రి కౌంటింగ్ , రి వెరిఫికేషన్ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు . - సబితా ఇంద్రారెడ్డి
  • తిరుమల కంటైన్మెంట్ జోన్ వార్తలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా క్లారిటీ. తిరుమలలో ఎలాంటి రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్ లేదు: కలెక్టర్. కేవలం ఒక ప్రాంతంలో ఉన్న పోలీస్ బెటాలియన్‌లో.. పోలీసులకు మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది: కలెక్టర్ . నారాయణ భరత్ గుప్తా. సిబ్బంది చిన్న పొరపాటుతో కంటైన్మెంట్ క్లస్టర్‌గా తిరుమల పేరు వచ్చింది. తెలియక చేసిన తప్పుకాబట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోం: కలెక్టర్. తిరుమలలో ప్రస్తుతానికి అద్భుతంగా దర్శనాలు జరుగుతున్నాయి: కలెక్టర్. సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించి భక్తులు సహకరిస్తున్నారు: కలెక్టర్. కరోనా కేసులు పెరిగితే టీటీడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో... చర్చించి ఆలయాన్నీ మూసివేసి అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాము. తిరుమల కొండపై మొత్తం 89మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. భక్తులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదు.
  • విజయవాడ: వలస కార్మికులను తరలించినందుకు ఆర్టీసీకి 15.71 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు,బకాయిలు చెల్లించిన ఆర్టీసీ . విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ ఆర్ బీఎస్ పెన్షన్ ,ఎస్ బిటీ చెల్లించిన ఆర్టీసీ. ఐటీఐ అప్రెంటీస్ లకు స్టైపండ్,ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ , డీజిల్ ఖర్చులు చెల్లింపు.
  • రేపటి నుండి గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే షాపులు తీసి ఉంచాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం. కంటైన్ మెంట్ జోన్లలో షాపులు తీయకూడదని నిర్ణయం. గత మూడు రోజుల నుండి నూట యాభైకి పైగా పాజిటివ్ కేసులు నమోదు. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు. అవసరం లేకుండా రోడ్లపైకి రావద్థని అధికారుల విజ్ఞప్తి.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • డిపాజిట్ల పేరుతో నిండా ముంచిన బెర్షెబా కంపెనీ . తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే అందుకు మూడింతలు నెలనెలా చెల్లిస్తామని దగా. కామారెడ్డి జిల్లా కేంద్రంగా బెర్షెబా కంపెనీ మోసం . తక్కువ డబ్బు చెల్లిస్తే ఎక్కువ వస్తాయనే ఆశతో వేలాదిమంది ఆ కంపెనీలో డబ్బు జమ. ఓ యువతి పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలిసులు. విచారణ చెపట్టి బెర్షెబా కంపెనీ యజమాని ఇస్మాయిల్ ను అరెస్టు . గతంలో ఇస్మాయిల్ పోలిసులకు కు సవాల్‌ . ఇస్మాయిల్ తో పాటు మరో 15మంది ఏజెంట్ల పై కెసు నమోదు.

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ బ్యాంక్. ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ని తొలగిస్తున్నట్లు బుధవారం పేర్కొంది. తాజాగా ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను..
SBI Waives Average Monthly Balance Requirement For All Savings Accounts, ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ బ్యాంక్. ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ని తొలగిస్తున్నట్లు బుధవారం పేర్కొంది. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (మినిమమ్ బ్యాలెన్స్) పాటించాల్సిన అవసరం లేదట. దీంతో.. ఈ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రూల్ బ్యాంక్‌లో ఉన్న 4.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

అలాగే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. దీంతో.. ఎస్‌బీఐ ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌‌లో రూ.2 వేలు, మెట్రో సిటీలో రూ.3 వేలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు ఉండేవి. ఇక నుంచి అవి ఉండబోవట. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే.. రూ.5 నుంచి రూ.15ల వరకూ ఛార్జీలను కూడా వసూలు చేయనుంది ఎస్‌బీఐ బ్యాంక్. కాగా.. అందులోనూ ఖాతాదారులకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తేయడం వారికి ఇది అతిపెద్ద శుభవార్తే అని చెప్పొచ్చు. మరోవైపు బుధవారం నుంచి ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై స్టేట్ బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లు తగ్గించింది.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు

Related Tags