AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. కట్ చేస్తే.. సీన్ లోకి అల్లుడు! షాకింగ్ నిజాలు వెలుగులోకి..!

ప్రేమించి పెళ్లాడిన భార్య కాపురానికి రావడం లేదనే కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు కారణమైన అత్తమామలను కారుతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు కిరాతక అల్లుడు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుపారీ ఇచ్చి మరీ అత్తమామలను అంతమొందించాలని చూసిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. కట్ చేస్తే.. సీన్ లోకి అల్లుడు! షాకింగ్ నిజాలు వెలుగులోకి..!
Mangalagiri Police Station
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 12:15 PM

Share

ప్రేమించి పెళ్లాడిన భార్య కాపురానికి రావడం లేదనే కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు కారణమైన అత్తమామలను కారుతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించాడు కిరాతక అల్లుడు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుపారీ ఇచ్చి మరీ అత్తమామలను అంతమొందించాలని చూసిన అల్లుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, పద్మావతి దంపతుల కుమార్తెను అదే ప్రాంతానికి చెందిన రాజబాబు ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, ఆ తర్వాత రాజబాబు ప్రవర్తనలో మార్పు రావడం, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య తన పుట్టింటికి వచ్చేసింది. రాజబాబు ప్రవర్తన నచ్చని అత్తమామలు.. తమ కుమార్తెను తిరిగి అతనితో కాపురానికి పంపించేందుకు నిరాకరించారు.

దీంతో అత్తమామలే తన కాపురానికి అడ్డుపడుతున్నారని భావించిన రాజబాబు, వారిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. వారిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ మాట్లాడి, అడ్వాన్స్ కింద రూ. 20 వేల నగదు అందజేశాడు. అత్తమామలను ఢీకొట్టడం కోసం ఒక కారును కూడా అద్దెకు తీసుకున్నాడు. జూన్ నెల 26వ తేదీన శ్రీనివాసరావు, పద్మావతిలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన దంపతులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మొదట దీనిని సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించిన పోలీసులు, ఆ తర్వాత వచ్చిన కొన్ని అనుమానాలతో విచారణ వేగవంతం చేశారు. కారు డ్రైవ్ చేసిన రాజబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు దారుణం బయటపడింది. ప్రమాదం జరిగిన రోజు సుపారీ గ్యాంగ్ ఎంతసేపు వేచి చూసినా దంపతులు బయటకు రాకపోవడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్రీనివాసరావు, పద్మావతిలు బయటకు రావడం గమనించిన రాజబాబు.. తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి వారిని ఢీకొట్టినట్లు అంగీకరించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముఖ్య నిందితుడు రాజబాబుతో పాటు, అతనికి సహకరించిన మరో ఇద్దరు సుపారీ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంగళగిరి సీఐ వీరాస్వామి అధికారికంగా వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us