Breaking: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న డా. కె.లక్ష్మణ్ స్థానే బండి సంజయ్ పదవిని చేపట్టనున్నారు. ఈ పదవికి బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, ధర్మపురి అరవింద్ కూడా పోటీ పడిన సంగతి తెలిసిందే. గత నెలాఖరుకే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పార్టీ హైకమాండ్ దూతలు వస్తారని ఇదివరకు వార్తలు వచ్చాయి. కె.లక్ష్మణ్ ఈ పదవి తనను తిరిగి వరించవచ్చునని ఆశించినప్పటికీ.. అది సఫలం కాలేదు.
కాగా 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గట్టిపట్టున్న బండి సంజయ్‌కు.. అటు బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్‌తోనూ మంచి సత్సంబంధాలున్నాయి.
Read This Story Also: డైలమాలో ‘మెగాస్టార్’.. సూపర్‌స్టార్ విషయంలో ‘ఆచార్య’ టీమ్ మాటేంటి..!