Acharya: డైలమాలో ‘మెగాస్టార్’.. సూపర్‌స్టార్ విషయంలో ‘ఆచార్య’ టీమ్ మాటేంటి..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Acharya: డైలమాలో 'మెగాస్టార్'.. సూపర్‌స్టార్ విషయంలో 'ఆచార్య' టీమ్ మాటేంటి..!
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2020 | 4:32 PM

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో త్రిష కూడా పాల్గొనబోతోంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను మొదట రామ్ చరణ్‌ను తీసుకున్నారు. అందుకు సంబంధించిన డేట్లను చెర్రీ కూడా ఇచ్చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ తనయుడు భాగం అవ్వలేకపోగా.. ఆ స్థానంలో సూపర్‌స్టార్ మహేష్‌ బాబు లైన్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్‌తో నటించేందుకు సూపర్‌స్టార్ రెడీగా ఉన్నారని.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో మహేష్‌ పాల్గొనబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర విషయంలో మెగాస్టార్ డైలమాలో ఉన్నారట.

నిజానికి చెప్పాలంటే ఈ పాత్ర చరణ్, మహేష్ ఎవరు చేసినా సినిమాపై క్రేజ్ కచ్చితంగా పెరుగుతుంది. అయితే చెర్రీ నటిస్తే మెగా మల్టీస్టారర్‌ అవ్వడంతో పాటు.. ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న చిరు- చెర్రీల కాంబినేషన్ కుదురుతుంది. అలా కాకుండా మహేష్ నటిస్తే.. అటు మహేష్ ఫ్యాన్స్‌లో ఈ మూవీపై క్రేజ్ వస్తోంది. దీంతో కలెక్షన్ల పరంగానూ ఈ ప్రాజెక్ట్‌కు ప్లస్‌ అవుతుంది. ఈ క్రమంలో మహేష్ నటించేందుకు చిరు ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. ఈ విషయంలో ఆయన మనసులో కొన్ని అనుమానాలు మెదులుతున్నాయట. మహేష్ నటిస్తే.. పాత్ర నిడివి విషయంలో ఆయన ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచనలో చిరు ఉన్నారట. ఇక ఈ ఇబ్బంది చెర్రీ విషయంలో పెద్దగా ఉండకపోవచ్చు.

అంతేకాదు ఈ చిత్రానికి చెర్రీ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి.. రెమ్యునరేషన్ కూడా అవసరం లేదు. మరోవైపు ఈ మూవీలో నటించేందుకు మహేష్‌కు దాదాపు రూ. 30కోట్ల మేర చెర్రీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా రెమ్యునరేషన్ విషయంలోనూ చిరు ఆలోచిస్తున్నారట. ఇది పక్కనపెడితే.. ఇద్దరు స్టార్ నటులు నటించినప్పటికీ.. అభిమానులను నొప్పించకుండా వారి వారి పాత్రలను కొరటాల తీర్చిదిద్దగలడన్న నమ్మకం చిరు మనసులో ఉందట. కానీ చెర్రీ విషయంలో ఓసారి రాజమౌళితో మాట్లాడాలని ఆయన భావిస్తున్నారట. జక్కన్న ఒప్పుకుంటే ఈ సినిమాలో చెర్రీనే పెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట. మరి మెగాస్టార్ ఆచార్యలో కీలక పాత్రలో ఎవరు నటిస్తారు..? మెగాసూపర్‌ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందా…? తండ్రీ కొడుకులు ఈ సినిమాలో నటించి.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొద్ది రోజలు ఆగాల్సిందే. కాగా ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు జగన్ షాక్..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?