AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: హరిత ఇంధనం నుండి సెమీకండక్టర్ల వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనపైనే అందరి దృష్టి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 15 నుండి 20 వరకు చేపట్టనున్న ఐదు దేశాల పర్యటనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో, ఈ పర్యటన భారతీయ ఎగుమతులకు ఒక వ్యూహాత్మక మలుపు కానుందని FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అభివర్ణించారు.

PM Modi: హరిత ఇంధనం నుండి సెమీకండక్టర్ల వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనపైనే అందరి దృష్టి!
Pm Modi Uae Europe Tour
Balaraju Goud
|

Updated on: May 14, 2026 | 7:36 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 15 నుండి 20 వరకు చేపట్టనున్న ఐదు దేశాల పర్యటనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో, ఈ పర్యటన భారతీయ ఎగుమతులకు ఒక వ్యూహాత్మక మలుపు కానుందని FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అభివర్ణించారు. మే 15 న ప్రారంభమయ్యే ఈ పర్యటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో సాగనుంది. ఈ ఐదు దేశాలతో భారతదేశానికి సమిష్టిగా 70 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ముడిపడి ఉందని ఎస్.సి. రల్హాన్ పేర్కొన్నారు.

ఇటీవల ముగిసిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), భారత్-ఈఎఫ్టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (TEPA) నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు సాంప్రదాయ రంగాలు మాత్రమే కాకుండా.. గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, రక్షణ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ వాణిజ్యం వంటి అత్యాధునిక రంగాలలో అరుదైన అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

యూఏఈతో భారతదేశ సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్లకు ఈ గల్ఫ్ దేశం భారతదేశానికి ఒక ముఖ్యమైన ముఖద్వారంగా పనిచేస్తోంది. ఈ పర్యటన ద్వారా ఇంధనం, మౌలిక సదుపాయాలు, సేవల వాణిజ్యంలో పెట్టుబడులు మరింత పటిష్టం కానున్నాయి.

నెదర్లాండ్స్, ఇటలీ దేశాలతో క్లీన్ టెక్నాలజీస్, బ్లూ ఎకానమీ మరియు స్థిరమైన సఫ్లై చైన్ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. ఇది ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు మేలు చేస్తుంది. ఓస్లో (నార్వే) లో జరిగే భారత్-నార్డిక్ శిఖరాగ్ర సదస్సు పునరుత్పాదక ఇంధనం, వాతావరణ సాంకేతికతలు, సముద్ర రంగాలలో పరస్పర సహకారానికి ఒక అద్భుతమైన వేదిక కానుంది. ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ లో ప్రధాని పాల్గొనడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. FIEO ఈ పర్యటనను ఒక సువర్ణావకాశంగా పేర్కొంది.

అలాగే 70 బిలియన్ డాలర్ల వాణిజ్య గణాంకం అనేది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. గ్రీన్ హైడ్రోజన్ నుండి సెమీకండక్టర్ల వరకు పేర్కొన్న రంగాలలో భారతదేశం ఇంకా అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలో నార్డిక్ దేశాల పెన్షన్ నిధులను భారత మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడులుగా ఆకర్షించడమే అత్యంత కీలకం. ప్రపంచ వాణిజ్య మార్గాలు ఒత్తిడిలో ఉన్న తరుణంలో, ఈ పర్యటన ఫలితాలను భారత పారిశ్రామిక సంఘాలు, ఎగుమతిదారులు నిశితంగా గమనిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us