AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీయే పునాది అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
Rjd Leader Tejashwi Yadav
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 30, 2021 | 12:08 AM

Share

దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీయే పునాది అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేని ఎదుర్కోవలసి వస్తే అందుకు ఓ కూటమిగా ఏర్పడే విపక్షాలకు మూలాధారం ఆ పార్టీయే అవుతుందని ఆయన చెప్పారు. అంతెందుకు ..? కాంగ్రెస్ లేనిదే అపోజిషన్ ఫ్రంట్ అన్నది ఊహించలేమని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గల 543 లోక్ సభ స్థానాల్లో కనీసం 289 సీట్లలో భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ నేరుగా పోటీ పడగలదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పార్టీ భాగస్వామిగా ఉంటేనే ఏ విపక్ష ఐక్యత్త అయినా సాధ్యమవుతుందని…అదే బేస్ (పునాది) అని ఆయన వ్యాఖ్యానించారు. సమయం మించిపోతోందని, ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు ఫ్రంట్ ఏర్పాటు కోసం సన్నాహాలు ప్రారంభించాలని తేజస్వి యాదవ్ సూచించారు. దేశం కోసం కొని పార్టీలు రాజీమార్గం అనుసరించాలని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్ కొన్ని పార్టీలతో రాజీ పడక తప్పదని పరోక్షంగా పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అని ఆయన చెప్పారు.

ఈ కూటమిలో ఎవరికీ సపోర్టు ఇవ్వాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నా చివరకు వాటిని పార్టీ హైకమాండ్ సరిదిద్దుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అది జాతీయ పార్టీ అని అభివర్ణించారు. ఇలా ఉండగా బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీ.. ఎన్డీయే కి దూరమయ్యే అవకాశాలను పరిశీలించాలని ఆయన మళ్ళీ పరోక్షంగా కోరారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇసుకలో చిక్కుకున్న బోటు .. అక్కడ పెళ్లి కూతురిని భుజాలపై మోసిన పెళ్ళికొడుకు…

పశ్చిమ బెంగాల్ లో ఎన్ హెచ్ ఆర్ సీ టీమ్ పై దాడి.. ఎవరీ గూండాలు అంటున్న సభ్యులు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!