పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ఫేస్ బుక్, గూగుల్ ఇండియా ప్రతినిధులు..ఏం చెప్పారంటే ..?

ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియా ప్రతినిధులు మంగళవారం కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు

పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ఫేస్ బుక్,  గూగుల్ ఇండియా ప్రతినిధులు..ఏం చెప్పారంటే ..?
Google And Facebook
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 30, 2021 | 12:12 AM

ఫేస్ బుక్ ఇండియా, గూగుల్ ఇండియా ప్రతినిధులు మంగళవారం కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. పౌరుల హక్కులు, సోషల్ మీడియా లేదా ఆన్ లైన్ మీడియాల దుర్వినియోగ నివారణ వంటి పలు అంశాలపై వారు వాంగ్మూలమిచ్చారు. ఫేస్ బుక్ తరఫున శివంత్ ధూక్రాల్, నమ్రతా సింగ్, గూగుల్ ఇండియా తరఫున అమన్ జైన్, గీతాంజలి దుగ్గల్ తమ తమ అభిప్రాయాలను, ఉద్దేశాలను వివరించారు. కోవిద్ కారణంగా తాము వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయామని ఫేస్ బుక్ ప్రతినిధులు చెప్పగా పార్లమెంట్ సెక్రటేరియట్ వర్చ్యువల్ మీటింగులను అనుమతించదని శశిథరూర్ వారికి స్పష్టం చేశారు, పౌరుల హక్కుల పరిరక్షణ, సోషల్..ఆన్ లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగ నివారణ అన్నవి ముఖ్య అంశాలు కాగా అలాగే డిజిటల్ స్పేస్ లో మహిళల సెక్యూరిటీ అన్నది కూడా అత్యంత ముఖ్యమని.. వీటి విషయంలో మీరు ఏం చేస్తున్నారని కమిటీ వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇందుకు ఈ ప్రతినిధులు తమ లక్ష్యాలను వివరించినట్టు సమాచారం.

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా నడచుకుంటున్నామని వీరు స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా కేంద్రానికి, ట్విటర్ కు మధ్య మాత్రం ఇంకా పరోక్షంగా వార్ కొనసాగుతోంది. తమ నిబంధనలు పారదర్శకమైనవని ట్విటర్ చెప్పుకొంటుండగా .. మా రూల్స్ ని మీ వైఖరి అతిక్రమించేదిగా ఉందని కేంద్రం అంటోంది. గత జూన్ 18 నే వీటి మధ్య భేటీ జరిగిన విషయం గమనార్హం. ఇలా ఉండగా మరికొన్ని వారాల్లో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు పంపే సూచనలున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

ఇసుకలో చిక్కుకున్న బోటు .. అక్కడ పెళ్లి కూతురిని భుజాలపై మోసిన పెళ్ళికొడుకు…

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?