AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇసుకలో చిక్కుకున్న బోటు .. అక్కడ పెళ్లి కూతురిని భుజాలపై మోసిన పెళ్ళికొడుకు…

బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో ఓ పెళ్లి కొడుకు తన కొత్త 'భార్య' ను (పెళ్లికూతురిని) భుజాలపై మోసుకుని తీసుకువెళ్లాడు. ఇందుకు కారణం నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడమే..

ఇసుకలో చిక్కుకున్న బోటు .. అక్కడ పెళ్లి కూతురిని  భుజాలపై మోసిన పెళ్ళికొడుకు...
Groom Carries Bride
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 30, 2021 | 12:04 AM

Share

బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో ఓ పెళ్లి కొడుకు తన కొత్త ‘భార్య’ ను (పెళ్లికూతురిని) భుజాలపై మోసుకుని తీసుకువెళ్లాడు. ఇందుకు కారణం నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడమే.. వివరాల్లోకి వెళ్తే.. ఈ జిల్లాలోని దిగల్ బ్యాంక్ బ్లాకు ప్రాంతం ఇటీవలి వర్షాలతో జలమయమైంది. దీంతో ఇక్కడి కంకాయ్ అనే నది ఉదృతంగా ప్రవహిస్తోంది.కాగా ఈ బ్లాకులోని వస్లా గ్రామంలో శివకుమార్ సింగ్ అనే వ్యక్తి పెళ్లి జరగగా”వధూవరులతో బాటు కుటుంబ సభ్యులంతా ఈ నదికి అవతల ఉన్న తమ గ్రామానికి బోటులో బయల్దేరారు. తీరం చేరుతుండగా బోటు మధ్యలోనే ఇసుకలో కూరుకుపోవడంతో ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అంతా బోటు దిగి కాలినడకన బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే బోటు దిగడానికి అవస్థలు పడుతున్న పెళ్లి కూతురిని చూసి శివకుమార్ సింగ్ కి జాలి వేసినట్టుంది. ఆమెను చటుక్కున భుజాలపైకి ఎక్కించుకుని ముందుకు కదిలాడు.. ఈ వీడియో వైరల్ అయింది.

బీహార్ లో ఏ మాత్రం వర్షం వచ్చినా ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుందని, నదిని దాటడానికి తాము పడవలనే ఆశ్రయించాల్సి వస్తోందని ఈ పెళ్ళివారు వాపోయారు. ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మించిన వంతెన కొట్టుకుపోయినా ఎవరూ మళ్ళీ కొత్త వంతెన నిర్మాణానికి పూనుకోలేదని వారు ఆరోపించారు. ఈ ప్రభుత్వాల తీరు మారదా …ఎన్నికలప్పుడు మాత్రమే మేం గుర్తుకు వస్తామా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా తమలాగే సమీప గ్రామాలవారు కూడా ఎన్నో అవస్థలు పడుతున్నారని వారు చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పశ్చిమ బెంగాల్ లో ఎన్ హెచ్ ఆర్ సీ టీమ్ పై దాడి.. ఎవరీ గూండాలు అంటున్న సభ్యుల

చైనా డ్రోన్లతో పాకిస్తాన్ జమ్మూ ఎయిర్ బేస్ పై దాడి చేసిందా..? ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు