పశ్చిమ బెంగాల్ లో ఎన్ హెచ్ ఆర్ సీ టీమ్ పై దాడి.. ఎవరీ గూండాలు అంటున్న సభ్యులు
బెంగాల్ లోని జాదవ్ పూర్ ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులపై మంగళవారం దాడి జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరపవలసిందిగా కలకత్తా హైకోర్టు ఈ కమిషన్ లోని కమిటీని ఆదేశించింది.
బెంగాల్ లోని జాదవ్ పూర్ ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులపై మంగళవారం దాడి జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరపవలసిందిగా కలకత్తా హైకోర్టు ఈ కమిషన్ లోని కమిటీని ఆదేశించింది. ఆ ఉత్తర్వుల మేరకు కమిటీ సభ్యులు మొదట జాదవ్ పూర్ ని విజిట్ చేశారు. ఇక్కడ 40 ఇళ్లను తగులబెట్టడమో, నాశనం చేయడమో జరిగిందని తాము కనుగొన్నామని వారు తెలిపారు. అయితే వీరిపైనా ఎటాక్ జరిగింది. ఈ గూండాలు ఎవరన్నది తెలియడంలేదని సభ్యుడొకరు అన్నారు. ఎన్నికల అనంతర హింసపై ఇన్వెస్టిగేట్ చేసేందుకు ..స్థానికులతో లేదా బాధితులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఈ కమిటీ సభ్యులు యత్నిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది ఏదైనా పార్టీవారా కారా అన్నది తెలియడం లేదని ఆ సభ్యుడు పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల అనంతర హింస తాలూకు ఘటనలపై బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు మరింత రాజుకున్నాయి. గవర్నర్ ని ఆమె అవినీతిపరుడని, జైన్ బ్రదర్స్ హవాలా స్కామ్ లో ఆయన పాత్ర ఉందని, ఆయనపై లోగడ ఛార్జ్ షీట్ కూడా పెట్టారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారాలని ఆయన ఆ తరువాత కొట్టి పారేశారు.
రాజ్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన…ఇది తప్పుడు సమాచారమని, ఏ ఛార్జి షీట్ లో తన పేరు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుశా రాజ్ భవన్ లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇదే మొదటిసారి.
మరిన్ని ఇక్కడ చూడండి: చైనా డ్రోన్లతో పాకిస్తాన్ జమ్మూ ఎయిర్ బేస్ పై దాడి చేసిందా..? ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు